: ఈసారి సీఎంకి గడువు కోరే హక్కులేదు: అక్బరుద్దీన్
రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ కోసం మరింత గడువును కోరే హక్కు సభానాయకుడిగా సీఎంకు లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ విభజన బిల్లుపై చర్చకు మరింత గడువు కోరే అవకాశం స్పీకర్ కే ఉందని అన్నారు. విభజన బిల్లుపై చర్చ కోసం రాష్ట్రపతి ఇచ్చిన వారం రోజుల గడువు కీలకం కానుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ నేతలు క్షణానికోసారి అభ్యంతరం చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.