: భార్య మాన్యత కోలుకోవాలని సంజయ్ దత్ ప్రార్థనలు
నటుడు సంజయ్ దత్ భార్య మాన్యత ప్రస్తుతం అనారోగ్యంతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ ఇటీవల దాదర్ లోని స్థానిక శ్రీ సిద్ధివినాయక గణపతి మందిర్ ను, దక్షిణ ముంబైలోని సయ్ హజి అబ్దుల్ రెహ్మాన్ షా బాబా దర్గాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు. మాన్యత త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు. కాగా, పేలుళ్ల కేసులో శిక్ష పడ్డ సంజయ్ ప్రస్తుతం భార్య కోసమే పెరోల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.