: కర్నూలులో కీచకపర్వం.. విద్యార్థినిని ఎత్తుకుపోయి ఐదురోజులు అత్యాచారం


కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామాంధుల కాముకత్వానికి పదో తరగతి విద్యార్థిని బలైపోయింది. కర్నూలు జిల్లా నందవరంలో శాంతరాజు, ఆదాంలు ఈ నెల 17న పదోతరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేశారు. ఐదు రోజుల పాటు ఆమెను నిర్బంధించి అత్యాచారం చేశారు. ఈ అకృత్యం ఆలస్యంగా వెలుగు చూడడంతో నందవరం పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలికపై దాష్టీకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News