: సొంత నియోజకవర్గంలో రాహుల్ కు నిరసనలు


భవిష్యత్ ప్రధానిగా ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో నిరసనలు ఎదురయ్యాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ అమేథీలో పర్యటిస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించకపోగా, భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. మరోవైపు రాహుల్ తో తాడోపేడో తేల్చుకుంటానంటూ ముందుగానే అమేథీలో వాలిపోయిన ఆమ్ ఆద్మీ నేత విశ్వాస్.. యువరాజుపై విమర్శలకు దిగారు. రాహుల్ నియోజకవర్గ ప్రజల బాధలను తెలుసుకోవడానికి రాలేదని, రాజకీయ విహారానికి వచ్చారని ఎద్దేవా చేశారు. మరోవైపు సోదరి ప్రియాంకతో కలిసి నిన్న అమేథీ చేరుకున్న రాహుల్ నియోజకవర్గ నేతలతో ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. అమేథీ ప్రజలతో తనది సుదీర్ఘ అనుబంధమని అన్నారు.

  • Loading...

More Telugu News