: రాష్ట్రపతితో భేటీ అయిన షిండే
రాష్ట్రపతితో కేంద్ర హోం శాఖ మంత్రి షిండే భేటీ అయ్యారు. రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు చర్చకు సంబంధించి... గడువు పెంచే అంశంపై వీరిరువురూ చర్చిస్తున్నారు. టీబిల్లుపై చర్చకు రాష్ట్రపతి తొలుత ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియనుండటంతో... గడువు పొడిగిస్తారా? లేదా? అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. దీనికి తోడు ఒక వేళ పొడిగిస్తే ఎన్ని రోజుల పాటు పొడిగిస్తారనే సందేహం నెలకొంది. దీంతో, వీరిద్దరి భేటీ అనంతరం మరికొద్ది సేపట్లో గడువుకి సంబంధించి అధికారిక సమాచారం వెలువడనుంది.