: బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: కేంద్ర మంత్రి పనబాక


తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. తుది శ్వాస వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని... ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సహకరించడంలేదని... అందుకే అనుకున్న స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రాజ్యసభ సీటు కేటాయిస్తే తిరస్కరించనని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందనే అంచనాలతో... పనబాక బీజేపీ తీర్థం పుచ్చుకోనుందనే వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News