: డల్లాస్ లో అక్కినేని సంస్మరణ సభ


మహానటుడు, సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు సంస్మరణ సభను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 25న స్థానిక సెయింట్ మేరీస్ మలంకర ఆర్థోడాక్స్ చర్చిలో ఈ సభను నిర్వహిస్తున్నామని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. 2012లో అక్కినేని అమెరికాలో పర్యటించినప్పుడు తానా ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం, ప్రత్యేక నాణెం విడుదల వంటి కార్యక్రమాల్లో ఆయన చాలా ఉల్లాసంగా పాల్గొన్నారని ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. అక్కినేనిని తాము సత్కరించుకోవడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News