: బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి: జానారెడ్డి
రాష్ట్ర విభజన జరిగితే లాభం పొందుతామని కొందరు అంటున్నారని, మరికొందరేమో నష్టం తప్పదని చెబుతున్నారని మంత్రి జానారెడ్డి సభలో చెప్పారు. లాభనష్టాలు బేరీజు వేసుకొంటూ పోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆర్టికల్ 3 ప్రకారం సభ్యులు కానీ, సభ కానీ అభిప్రాయం మాత్రమే చెప్పాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని జానారెడ్డి సభ్యులకు గుర్తుచేశారు. ఆ అంశానికి సంబంధించిన కొన్ని పాయింట్లను కూడా ఆయన సభ్యులకు చదివి వినిపించారు. ఆనాడు ఇందిరాగాంధీ ఏం చెప్పినా, ఇటీవల అద్వానీ ఏం చెప్పినా అదంతా బిల్లు రాక ముందే అని జానారెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి, సభ్యులు బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాల్సిన అవసరముందని జానారెడ్డి పేర్కొన్నారు.