: నేను నాగంను కాదు..నా భావాలు మారవు: సీఎం
తాను బీజేపీ నుంచి నేర్చుకునే దుస్థితిలో లేనని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, నాగం జనార్ధనరెడ్డిలాగ తాను తన అభిప్రాయాలను మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. గతంలో సమైక్యవాదం వినిపించిన నాగం, ఇప్పుడు భావాలు మార్చుకున్నారని... ఆయనలా తాను మారేవ్యక్తిని కాదని సీఎం స్పష్టం చేశారు.