: గడువు పొడిగింపుపై రాత్రి కానీ.. లేక రేపు కానీ నిర్ణయం...
టీబిల్లుపై చర్చకు సమయాన్ని పొడిగిస్తారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. సాయంత్ర 4 గంటలకల్లా దీనిపై స్పష్టత వస్తుందని అందరూ భావించినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఈ విషయమై ఢిల్లీలోనే ఉన్నారు. గడువు పొడిగింపుకు సంబంధించి ఈ రాత్రికి గాని, రేపు కానీ నిర్ణయం వెలువడవచ్చని డిప్యూటీ సీఎం దామోదరకు మహంతి తెలిపినట్టు సమాచారం. ఇంతవరకు దీనిపై క్లారిటీ లేకపోవడంతో, ముఖ్యమంత్రి కిరణ్ శాసనసభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగం వాడివేడిగా కొనసాగుతోంది.