: అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా


సచిన్ నిష్క్రమణ టీమిండియాకు కలిసి వచ్చినట్టు కన్పించడం లేదు. సొంత గడ్డపై పులుల్లా విజృంభించిన భారత జట్టు విదేశాల్లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. బౌలర్ల ప్రదర్శన, కీలక సమయాల్లో బ్యాట్స్ మన్ కుప్పకూలడంతో టీమిండియా నెంబర్ వన్ స్థానానికి ఆసీస్ ఎసరు పెట్టింది. హామిల్టన్ లో జరిగిన రెండో వన్డేలో పరాజయం పాలైన భారత జట్టు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కోల్పోయింది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టూర్లలో భారత జట్టు అత్యంత చెత్త ఆటతీరు ప్రదర్శించింది. దీంతో రెండు రేటింగ్ పాయింట్లు చేజార్చుకుంది. భారత్ ఖాతాలో 117 పాయింట్లు ఉండగా, 118 పాయింట్లు ఉన్న ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ నెంబర్ వన్ గా అగ్రపీఠాన్ని దక్కించుకుంది.

  • Loading...

More Telugu News