: 'పద్మశ్రీ' ఒడిస్సీ డాన్సర్ పై కేసు


పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఒడిస్సీ డాన్సర్ ఇలియానా సిటారిస్టిపై ఒడిశాలోని భువనేశ్వర్ లో కేసు నమోదైంది. డాన్స్ స్కూల్లో 10 ఏళ్ల విద్యార్థినిని దండించినందుకు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇలియానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటలీలో జన్మించిన ఇలియానా ఒడిస్సీ నృత్యానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను 2006లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.

  • Loading...

More Telugu News