: లగడపాటిని స్టేజ్ మీద నుంచి కిందకు లాగేసిన తెలంగాణ నేత


విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద ఏపీఎన్జీవోలు చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి లగడపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా లగడపాటిని తెలంగాణ విద్యార్థి సంఘం నేత బండి ప్రకాష్ స్టేజి మీద నుంచి కిందకు లాగేశారు. దీంతో లగడపాటి స్టేజి మీద నుంచి కిందకు పడిపోయారు. వెంటనే బండి ప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొతమంది తెలంగాణ విద్యార్థులు స్టేజి మీదకు చెప్పులు విసిరారు. జరిగిన ఘటనతో ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొక్కిసలాట చోటుచేసుకుంది. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.

  • Loading...

More Telugu News