: అక్కినేనికి గవర్నర్ రోశయ్య సంతాపం.. పవన్, మహేష్ నివాళులు
తమిళనాడు గవర్నర్ రోశయ్య హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి, ఆయన మృతికి సంతాపం తెలిపారు. అటు హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, జూనియర్ ఎన్టీఆర్ సందర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కినేని కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.