: అక్కినేనిలో దాగిన రచయిత
అక్కినేని మంచి నటుడిగానే అశేష జనవాహినికి తెలుసు. కానీ, ఆయనలో మంచి రచయిత కూడా దాగి ఉన్నాడనేది చాలా కొద్ది మందికే తెలిసిన విషయం. ఆయనిప్పటికే పలు రచనలు చేశారు. 'నేను నా జీవితం' పేరుతో తన జీవిత చరిత్రను పుస్తకానికెక్కించారు. తన అమెరికా అనుభవాలను 'నేను చూసిన అమెరికా' పేరుతో గ్రంథస్తం చేశారు. 'అ ఆలు', 'మనసులోని మాట' కూడా ఆయన రచనలే. మనసులోని మాట అక్కినేని సినీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.