: రెండు నెలల తర్వాత ఏదో ఒక పార్టీలో చేరతా: సబ్బం హరి
రెండు నెలల అనంతరం ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతానని ఎంపీ సబ్బం హరి వెల్లడించారు. వైఎస్సార్సీపీ తనను కాదన్న మాత్రాన ఖాళీగా కూర్చోవడానికి తానేమీ రాజకీయ సన్యాసం తీసుకోలేదన్నారు. జగన్ పార్టీ వాళ్లు ఆందోళనలు ఇంతటితో ఆపితే మంచిదన్న సబ్బం.. జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయవద్దని తన అనుచరులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.