: మహనీయులను అవమానించడం మా ఉద్దేశం కాదు: ఈటెల
టాంక్ బండ్ పై నిర్మించిన మహనీయుల విగ్రహాలను పగులగొట్టి, వారిని కించపరచడం తమ ఉద్దేశం కాదని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ విగ్రహాలు కూలిపోయాయంటూ నెత్తి నోరు బాదుకుంటున్న నేతలు... తెలంగాణ తల్లులు కన్నీరు కార్చినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.