: కొత్త పెళ్లికొడుకు.. కనిపించకుండా పోయాడు


ఆ కొత్త పెళ్లికొడుకు.. పెళ్ళైన రెండు నెలలకే కనిపించకుండాపోయాడు. దాంతో, అతని ఆచూకీ తెలపాలంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాదు శివారు మీర్ పేట పీఎస్ పరిధిలో జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి కన్నీరు రాజు, అల్మాస్ గూడకు చెందిన లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అల్మాస్ గూడలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకుని కొత్త కాపురం పెట్టారు. ఐతే, రాజు తన తల్లిదండ్రులను చూసి వస్తానంటూ లక్ష్మికి చెప్పి 12వ తేదీన ఇంటి నుంచి వెళ్లాడు. అంతే.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News