: మరింత బాధ్యతాయుతంగా ఆడాలి: కోహ్లీ


తన సహచర ఆటగాళ్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేసినా.. మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో 24 పరుగుల తేడాతో ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో గెలిచి ఉంటే బావుండేదని.. అయినా తమకిది సానుకూల ప్రారంభంగా చెప్పాడు. సిరీస్ లో మిగిలిన మ్యాచుల్లో మరింత బాధ్యతాయుతంగా ఆడతామని తెలిపాడు. తన బ్యాటింగ్ పై కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ కు ముందు ఐదు రోజులపాటు చేసిన సాధన ఉపకరించిందని చెప్పాడు.

  • Loading...

More Telugu News