: కబడ్డీ ఆటగాళ్ల వేలంలో పాల్గొననున్న అమితాబ్ కంపెనీ
కబడ్డీ గ్రామీణ క్రీడ. ఇది క్రికెటంత పాప్యులర్ ఏమీ కాదు. కానీ, దీనిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కు మక్కువ కలిగింది. కబడ్డీ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) నాల్గవ ఎడిషన్ ఆటగాళ్ల వేలంలో అమితాబ్ బచ్చన్ కు చెందిన ఏబీ కార్పొరేషన్ పాల్గొననుంది. ఐపీఎల్ లో క్రికెటర్ల వేలం వలే కబడ్డీ ఆటగాళ్లను వేలం వేయడం ఇదే మొదటిసారి. ఈ వేలంలో ఏబీ కార్పొరేషన్ తోపాటు ఓఎన్ జీసీ, ఎయిర్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు కూడా రంగంలోకి దిగనున్నాయి. పాట్నాలో నేటి నుంచి జరగనున్న జాతీయ కబడ్డీ చాంపియన్ షిప్ సందర్భంగా ఈ వేలం ఉంటుందని అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ సెక్రెటరీ కుమార్ విజయ్ చెప్పారు. కేపీఎల్ తేదీలను కూడా నిర్ణయిస్తామన్నారు.