: రాహుల్ నన్ను కోరితే ప్రచారం చేస్తా: సల్మాన్ ఖాన్
నటుడు సల్మాన్ ఖాన్ తాజాగా ఓ కొత్త విషయం వెల్లడించాడు. ఓ రాజకీయ నేతగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే ఇష్టమని చెప్పాడు. తన అవసరం ఉన్నప్పుడు, రాహుల్ కోరితే తప్పకుండా ఆయన తరపున ప్రచారం చేస్తానని వెల్లడించాడు. అయితే, గుజరాత్ లో మోడీకి తన అవసరం లేదని, ఆయన చాలా ప్రజాదరణ కలిగిన వ్యక్తని పేర్కొన్నాడు. ఓ ఆంగ్ల చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సల్మాన్ ఈ ఆసక్తికర విషయాలు తెలిపాడు.