: ఐజీతో ప్రాణహాని ఉంది.. కాపాడండి: వల్లభనేని వంశీ
ఐజీ సీతారామాంజనేయులుతో తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి, విజయవాడ పోలీస్ కమిషనర్ కు టీడీపీ నేత వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సీతారామాంజనేయులు మాజీ నక్సలైట్లతో తనను చంపించాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ దిశగా వారు ప్రయత్నాలను కూడా ఆరంభించారని తెలిపారు. తనకు భద్రత కల్పించి ప్రాణాలను కాపాడాలని కోరారు. దీంతో ఆయనకు తగు భద్రత కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇదే విషయమై సీఎం అపాయింట్ మెంట్ కోసం వంశీ ప్రయత్నించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం అపాయింట్ మెంట్ ఆయనకు దొరకలేదు. గతంలో సీతారామాంజనేయులు విజయవాడ సీపీగా పనిచేసినప్పుడు, వీరిద్దరి మధ్య వార్ నడిచింది.