: వాజ్ పేయి ప్రధాని అయినా, కలాం రాష్ట్రపతి అయినా చంద్రబాబు చలవే!: రేవంత్ రెడ్డి
సెక్యులర్ పార్టీలతో కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయించిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, గతంలో తమ పార్టీతో అంటకాగిన ఎంఐఎం ఇప్పుడు తమ పార్టీని విమర్శించడం తగదని అన్నారు. రాజకీయాల్లో కానీ, వ్యవస్థను నడపడంలో కానీ విభిన్న పంథాతో సమర్థవంతమైన పాలన అందించామని అన్నారు. వాజ్ పేయి ప్రధాని అయినా, కలాం రాష్ట్రపతి అయినా దానికి కారణం చంద్రబాబేనని ఆయన తెలిపారు.