: బాలీవుడ్ దర్శకుడికి గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారం
ప్రతి సంవత్సరం బహూకరించే గొల్లపూడి శ్రీనివాస్ స్మారక జాతీయ అవార్డుకు బాలీవుడ్ దర్శకుడు కమల్ కేఎం ఎంపికయ్యారు. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ భాషలకు సంబంధించి మొత్తం 20 నామినేషన్లను పరిగణనలోకి తీసుకున్నారు.
అయితే, తొలి చిత్రం 'ఐడీ'తో అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికలపై సత్తా చాటిన కమల్ కేఎంను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆగస్టు 12 న జరిగే ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. సుప్రసిద్ధ నటుడు గొల్లపూడి మారుతి రావు ఆయన తనయుడు శ్రీనివాస్ పేరిట ఈ అవార్డును అందిస్తున్నారు.