: హైదరాబాదును అభివృద్ధి చేసినది నిజాం కాదు: చంద్రబాబు
శాసనసభలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ప్రసంగానికి బాబు అడ్డు తగిలారు. నాలుగు వందల ఏళ్ల నాటి హైదరాబాదు అభివృద్ధి చెందింది నిజాం పాలనలో కాదని ఆయన అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనలోనే హైదరాబాదు నగరంలో అభివృద్ధి జరిగిందని, హైటెక్ సిటీ, ఫ్లై ఓవర్ లు, రోడ్ల విస్తరణ వంటి ఎన్నో కార్యక్రమాలతో నగరాన్ని అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనంతరం సభలో అక్బరుద్దీన్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.