: స్థలం మారండి.. కేజ్రీవాల్ ను కోరిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రైల్ భవన్ వద్ద ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ పోలీసులు అడ్డుచెప్పారు. ధర్నా స్థలాన్ని రైల్ భవన్ వద్ద నుంచి జంతర్ మంతర్ కు మార్చాలని సూచించారు. రైల్ భవన్ వద్ద ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ పది రోజులపాటు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. అయితే పోలీసుల తాజా విజ్ఞప్తి ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య దూరం పెంచుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందించలేదు.