: పోలీసుల తీరుకు నిరసనగా ఏఏపీ ధర్నా
ఢిల్లీ పోలీసులు సరిగా పనిచేయడం లేదంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద నిరసన చేపట్టింది. ఈ ధర్నా పది రోజుల పాటు కొనసాగిస్తామని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. నిజాయతీ పరులైన పోలీసు అధికారులపై సీనియర్లు లంచాలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన చెప్పారు. నిజాయతీపరులైన పోలీసులు తమ ఆందోళనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ పోలీసులు సామాన్యుల కోసం పనిచేయడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో మహిళలకు భద్రత లేనప్పుడు తాను మౌనంగా ఎలా ఉండగలనని ఆయన ప్రశ్నించారు.