: తమిళనాడు నుంచి ఆమ్ ఆద్మీ పోటీ చేయచ్చు: ప్రశాంత్ భూషణ్
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరాటపడుతోంది. ఈ మేరకు తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేసే అవకాశం ఉందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ భూషణ్ తెలిపారు. నిన్న (ఆదివారం) చెన్నైలో పార్టీ వలంటీర్ల ముగింపు సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. సహేతుకమైన అవకాశాలున్న అన్ని రాష్ట్రాల్లో పోటీచేసే ప్రయత్నం చేస్తామన్నారు. అయితే, తమిళనాడులో కూడా అదే ఉత్సాహం చూపుతామని తెలిపారు. అయితే, దానికి సంబంధించి ఫిబ్రవరి చివరిలో అధికారిక నిర్ణయం తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు.