: ఏఏపీ నిరసనతో ఢిల్లీలో నాలుగు మెట్రో స్టేషన్ల మూసివేత


ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నిరసన నేపథ్యంలో ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం వరకు ఢిల్లీలోని నాలుగు మెట్రో స్టేషన్స్ ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, రేస్ కోర్సు స్టేషన్స్ ఈ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మూసివేసినట్లు వారు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల సూచన మేరకు మెట్రో స్టేషన్లను మధ్యాహ్నం వరకు మూసివేసినట్లు వారు పేర్కొన్నారు. నార్త్ బ్లాక్ వద్ద ఏఏపీ ధర్నా నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా వారు తెలిపారు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ వద్ద ఈ ఉదయం గుర్తింపు కార్డుల ఆధారంగా వారిని బయటికి పంపివేసినట్లు వారు చెప్పారు. పరిస్థితిని సమీక్షించి, మరో గంట తరువాత ఈ స్టేషన్లను తెరుస్తామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News