: 1993 ముంబై బాంబు పేలుళ్ల నిందితురాలికి నెల రోజుల పెరోల్


1993 ముంబై బాంబు పేలుళ్ల సహ నిందితురాలు జైబునీసా కజీ(70)కు నెల రోజుల పెరోల్ లభించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను ఈ మధ్యాహ్నం ఆమె కూమార్తె స్టేట్ సెక్రటేరియట్ నుంచి పొందనుంది. పేలుళ్ల కేసులో గతేడాది సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం నటుడు సంజయ్ దత్ తో పాటు జైబునీసా కూడా క్షమాభిక్ష కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ కు దరఖాస్తు చేసుకుంది. అటు కొన్ని రోజుల తర్వాత పెరోల్ కోసం పెట్టుకున్న ఆమె విజ్ఞప్తిని డివిజినల్ కమిషనర్ తిరస్కరించారు.

  • Loading...

More Telugu News