: 610 జీవోపై అన్నీ అవాస్తవాలే: పయ్యావుల


610 జీవోపై టీఆర్ఎస్ నేతలు అన్నీ అవాస్తవాలే చెప్పారని పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు కేవలం వెయ్యి మంది ఉద్యోగాలలో మాత్రమే ఉల్లంఘన జరిగిందని అన్నారు. గతంలో జరిగిన ఉల్లంఘనలను సరిదిద్దాలనే లక్ష్యంతోనే ఎన్టీఆర్ 610 జీవో చట్టం తెచ్చారని అన్నారు. చంద్రబాబు దానిని అమలు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.

50 రూపాయలకు హార్స్ పవర్ పంపులు ఇవ్వడంతో తెలంగాణ ప్రాంత రూపురేఖలు మారలేదా? అని ఆయన ప్రశ్నించారు. బాబు హయాంలో 18 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. లక్షలాది బోర్లు వేశారని అన్నారు. అలాగే తెలంగాణ వస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయని అవాస్తవ ప్రకటనలు చేశారు.

అవన్నీ అవాస్తవాలేనని, కొన్ని ఉద్యోగాలు రావడం సహజమే కానీ, వారు చెబుతున్నట్టు అన్ని ఉద్యోగాలు రావని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారని, అది సరైన ప్రకటన అని పయ్యావుల తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం 60 శాతం అధికంగా ప్రయోజనం పొందిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విలీనం కాకముందు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంది?, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? ఇప్పుడు ఉన్న సౌకర్యాల సంగతి అందరికీ తెలిసినవేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News