: మోడీ క్షమాపణ చెప్పనవసరం లేదు: సల్మాన్ ఖాన్
గుజరాత్ లో 2002నాటి మారణహోమానికి నరేంద్రమోడీయే కారణమని అందరూ విమర్శిస్తుంటే.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మాత్రం మోడీకి బాసటగా నిలిచారు. నాడు గోద్రా ఘటన తర్వాత జరిగిన మత ఘర్షణలపై గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ క్షమాపణ చెప్పనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఘర్షణల కేసులో మోడీ నిర్దోషి అంటూ కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సల్మాన్ ఈ విధంగా చెప్పారు. అయితే, మోడీని ప్రధానమంత్రిగా ఆమోదించే విషయంలో మాత్రం ఆయనేమీ చెప్పలేదు. తన అభిప్రాయాలు కోట్లాది మంది అభిమానులపై ప్రభావం చూపడం తనకిష్టం లేదన్నారు.