: 1,000 చాయ్ వాలాలతో మోడీ సంభాషణ
టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని కాలేరని.. మోడీ కావాలంటే ఏఐసీసీ కార్యాలయం వద్ద టీ స్టాల్ పెట్టుకోవచ్చని.. ఇలా రకరకాల ప్రకటనలతో తనను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తగిన రీతిలో జవాబిస్తూ వస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే ఆయన దేశవ్యాప్తంగా 300 పట్టణాల్లోని 1,000 మంది టీ స్టాల్ యజమానులతో వచ్చే నెల 1వ తేదీన డీటీహెచ్, ఇంటర్నెట్ ద్వారా సంభాషించనున్నారు.