: తొలి వన్డేలో భారత్ గెలుపు


శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అన్ని రంగాల్లో రాణించి విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 39.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో మెండిస్(17) అత్యధికంగా పరుగులు సాధించింది. అనంతరం 77 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 32.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 34 పరుగులతో నాటౌట్ గా నిలిచి రాణించగా, బౌలర్లలో గౌహర్ సుల్తానా(4), జులన్ గొస్వామి(2) మంచి ప్రదర్శన చేశారు.

  • Loading...

More Telugu News