: సునంద మృతిపై దర్యాప్తును వేగవంతం చేయండి: షిండేకు థరూర్ లేఖ
హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు కేంద్ర మంత్రి శశిథరూర్ లేఖ రాశారు. సునంద పుష్కర్ మృతిపై దర్యాప్తును వేగవంతం చేసి నిజాలు వెలికి తీయాలని ఆ లేఖలో కోరారు. సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, శవపరీక్షలో ఆమెకు గాయాలు అయినట్టు, అసాధారణ మరణంగా నిపుణులు నిర్థారించిన సంగతి తెలిసిందే. దీంతో అందరి చూపూ శశిథరూర్ పై పడడంతో థరూర్ హొం మంత్రికి లేఖ రాశారు.