: ప్రియుడి కోసం పోలీస్ స్టేషన్ ముందు దీక్ష


పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా మరో యువతితో తుర్రుమన్నాడు. ఆ వంచక ప్రియుడిపై ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన బాణోతు రజని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా తనను వంచించిన చందూలాల్ పై చర్యలు తీసుకోవడం లేదంటూ రజని పోలీస్ స్టేషన్ ముందు దీక్షకు దిగింది. అయితే, నిందితుడిపై చర్యలు తీసుకోవడానికి బాధితురాలి తల్లిదండ్రులే అడ్డుపడుతున్నారని పోలీసులు అంటున్నారు. తమ కూతురికి అతడితో పెళ్లి జరిపించాలని కోరుతున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News