: అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేస్తే రాజద్రోహం కేసు పెట్టాలి: నారాయణ
అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేసే వారిపై రాజద్రోహం కేసు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా శాసనసభ జరుగుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ద్వంద్వ నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆధార్ కార్డు అమలులోని లోపాలపై త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయనున్నట్లు నారాయణ చెప్పారు.