: రాష్ట్రపతీజీ... ఈ వివరాలు కావాలి!: సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంలో తాము అడుగుతున్న 9 అంశాలపై పూర్తి వివరాలు కావాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఈ లేఖను స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా రాష్ట్రపతికి పంపించారు. లేఖలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు కోరిన అంశాల వివరాలు
బిల్లుపై న్యాయ, ఆర్థిక, నీటి పారుదల వంటి కీలక అంశాలపై సూచనలు ఏమిటి?
371డీ ఉమ్మడి రాజధానిపై అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి?
గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడంపై అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి?
బిల్లుకు సంబంధించి కేబినెట్ నోట్ ను మంత్రిమండలి ముందు ఏ నిబంధన ప్రకారం పెట్టారు?
సీమాంధ్ర ప్రాంత, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ నివేదిక ఏమైంది? దాని వివరాలు ఏమిటి?
ఉమ్మడి రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్ర ఆర్థికశాఖ ఇచ్చిన అభిప్రాయం ఏమిటి?
భద్రాచలం డివిజన్ ను తెలంగాణలో కలపడంలో కేంద్ర హోంశాఖ సూచించిన సహేతుకత ఏమిటి?
14 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాల్లో ఎవరికీ కేటాయించని విద్యుత్ పరిస్థితి ఏమిటి? పూర్తి వివరాలు చెప్పండి.
క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ నుంచి వచ్చే విద్యుత్ ను రాష్ట్రాలకు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ అవసరమా?
సాగునీటి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటానని పేర్కొంది. దీనిపై ఏజీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమగ్ర సమాచారం కావాలని పేర్కొంటూ లేఖ రాశారు.

  • Loading...

More Telugu News