: ఏప్రిల్ 11 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
భారత ఐటీ ప్రొఫెషనల్స్ కో శుభవార్త! ఇటీవల కొంతకాలంగా హెచ్1బీ వీసాల జారీ నిలిపివేసిన అమెరికా మళ్లీ ద్వారాలు తెరిచింది. ఏప్రిల్ 11 నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ప్రకటించింది. 2008-09 ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికా హెచ్1బీ వీసాలకు ఆహ్వానం పలకడం ఇదే తొలిసారి.
దేశంలో ఆర్ధిక స్ధితిగతులు మెరుగవడం, కంపెనీలు లాభాల బాటలో పయనిస్తుండడంతో మళ్లీ విదేశీ నిపుణులకు అవకాశాలు కల్పించాలని అమెరికా భావిస్తోంది. మొత్తం 65,000 వీసాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే, తొలి 20000 ఉన్నత విద్యార్హతలు, అమెరికా మాస్టర్స్ డిగ్రీ ఉన్నా వారికి కేటాయిస్తారని తెలుస్తోంది. హెచ్1బీ వీసాలను అమెరికా కంపెనీల్లో తాత్కాలిక నియామకాల కోసం వచ్చే విదేశీయులకు జారీ చేస్తారు.