: 22న ఛలో హైదరాబాద్.. సమైక్యవాదులు భారీగా తరలిరండి: అశోక్ బాబు
ఈ నెల 22న ఏపీఎన్జీవోలు తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలిరావాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఛలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు రాజకీయ భవిష్యత్ ఉండాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకోవాలని సూచించారు. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కలిసి సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరతామని ఆయన తెలిపారు.