: యాక్సిక్ బ్యాంకులో అంతర్గత దర్యాప్తు ప్రారంభం


మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్సిస్ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మనీలాండరింగ్  వ్యవహారాలతో సంబంధం ఉందని భావిస్తున్న 16 మందిని అడ్మినిస్ర్టేటివ్ కార్యాలయాలలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో బ్యాంక్ ఐసీఐసీఐ విచారణ పూర్తయేంత వరకూ 18 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ వెబ్ సైట్ 'కోబ్రాపోస్ట్' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ, ఐసిఐసిఐ బ్యాంకులు భారీగా మనీలాండరింగ్ కు (అంటే ఖాతాదారుల అధిక విలువ కలిగిన లావాదేవీలను దాచి ఉంచడం, అక్రమ సొమ్మును రాజమార్గాలలో స్వీకరించడంలాంటివి) పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన ఆర్ బీఐ వారికి షోకాజ్ నోటీసులు పంపింది. ఫలితంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. 

  • Loading...

More Telugu News