: రేవంత్ రెడ్డిపై రాళ్లు రువ్విన ఆగంతకులు
తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో ఆగంతకులు ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో దెబ్బలేమీ తగలకుండా రేవంత్ రెడ్డి బయటపడ్డారు.