: కాంగ్రెస్, టీడీపీలు బురదజల్లుతున్నాయి: వాసిరెడ్డి పద్మ
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు సహకరిస్తూ వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేకే డ్రామాలకు తెరలేపుతున్నారని చెప్పారు.