: తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేసిన ఆసీస్
భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మొహాలీ లో జరుగుతోన్న మూడో టెస్ట్ లో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ 408 పరుగులకు ముగించింది. 273 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు ఈ ఉదయం మరో 135 పరుగులు జోడించింది. భారత బౌలర్లలో జడేజా, శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, ఓజాలు చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారత ఓపెనర్లు విజయ్, ధావన్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి వికెట్ నష్టపోకుండా 3పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.