: మీ గురించి మీరు చెప్పండి.. మా గురించి మేం చెప్పుకుంటాం: సీఎం కిరణ్
ప్రజల అభిప్రాయాలు వేరు.. పార్టీల అభిప్రాయాలు వేరని.. సీపీఎం నేత తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తమ పార్టీ అభిప్రాయాన్ని తాము తెలియజేస్తామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో జూలకంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ సీమాంధ్రకు సంబంధించిన నేతలెవరూ విభజనను కోరలేదని స్పష్టం చేశారు. విభజన నిర్ణయం వచ్చిన తరువాత ప్రజల్లో తీవ్ర స్పందన వచ్చిందని, దానిని అధిష్ఠానానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, అందుకే తాము తమ పార్టీకి వినతులు, విజ్ఞప్తులు చేశామని ఆయన అన్నారు. విభజనపై పార్టీలో మేమేం చేశామో, తెలంగాణ సమస్యను ఏరకంగా పరిష్కరించాలనేదానిని తాము మాట్లాడేటప్పుడు సమగ్రంగా వివరిస్తామని ఆయన తెలిపారు.