: ఏఐసీసీ సమావేశానికి హాజరైన లగడపాటి, హర్షకుమార్
ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశానికి సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ హాజరయ్యారు. సమావేశంలో ఎంపీలు తెలంగాణ, సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సమావేశంలో సమైక్యవాదం వినిపిస్తారన్న అనుమానంతోనే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానాలు పంపలేదు. అంతేకాక సోనియా రాజకీయ సలహాదారు ఫోన్ చేసి మరీ సమావేశానికి రావద్దని ఎంపీలను కోరారు. దాంతో, తీవ్ర అసంతృప్తి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్ఠానంతో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లారు.