: చర్చను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది: మంత్రి ఆనం
బిల్లుపై శాసనసభలో చర్చను వ్యతిరేకిస్తూ పలుమార్లు సభనుంచి వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్ చేయడాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుబట్టారు. చర్చలో పాల్గొనకుండా ఇష్టం వచ్చినన్ని సార్లు సభనుంచి వెళ్లడం సరైన చర్య కాదన్నారు. పాదయాత్రలో వైఎస్ సమాధిపై చేసిన ప్రమాణాలను సభలో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇలా చేసి చర్చను అడ్డుకునేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ బయటకు వెళ్లడానికి స్పీకర్ అనుమతి ఇవ్వరాదని ఆనం కోరారు.