: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ 'అనూహ్య' దారుణ హత్య


రాష్ట్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనూహ్య (23) ముంబైలో దారుణ హత్యకు గురైంది. ఈమె ముంబైలోని టీసీఎస్ కంపెనీలో పనిచేస్తోంది. క్రిస్మస్ సెలవులకు సొంత ఊరికి వచ్చిన అనూహ్య... ఈ నెల 4న విజయవాడలో విశాఖ-ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ లో ముంబై బయలుదేరింది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి చివరిసారిగా తండ్రితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్ రాలేదు. అనూహ్య తండ్రి ఎన్నో సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. దాంతో ఆయన అనూహ్య స్నేహితురాలికి కూడా ఫోన్ చేశారు. ఆమె నుంచి కూడా సరైన సమాచారం అందలేదు. దీంతో ఈ నెల 5వ తేదీన అనూహ్య కనిపించడం లేదంటూ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

11 రోజుల అనంతరం నిన్న (గురువారం) ఆమె మృత దేహాన్ని ముంబైలోని కుంజుమార్గ్ లో కనుగొన్నారు. ఆమె మృత దేహం కాలిన గాయాలతో కుళ్లిపోయింది. ఆమె వేలికి ఉన్న ఉంగరం ఆధారంగా ఆమె తండ్రి అనూహ్యను గుర్తించారని పోలీసులు తెలిపారు. ముంబై వచ్చిన తర్వాతే ఆమె అదృశ్యమైందని పోలీసులు గుర్తించారు. అనూహ్యను దుండగులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్టు భావిస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసును మర్డర్ కేసుగా నమోదు చేశారు. పోస్టు మార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News