: అధికార, విపక్ష పార్టీలు విభజనకు కుట్రపన్నాయి: వైఎస్ విజయమ్మ


రాష్ట్ర విభజనకు అధికార, విపక్ష పార్టీలు కలిసి కుట్ర పన్నాయని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శాసనసభలో ఆరోపించారు. విభజన బిల్లుపై సభలో చర్చ నేపథ్యంలో మాట్లాడిన ఆమె.. విభజనను అడ్డుకోవడమే తమ లక్ష్యమని, దానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు. సమైక్యం తమ విధానమని.. విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీలో తీర్మానం, ఓటింగ్ పై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కానీ, ఓటింగ్ ఉంటుందా.. లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సభలో విజయమ్మ డిమాండ్ చేశారు. తామడిగిన ఓటింగ్ అంశంపై స్పీకర్ స్పష్టత ఇవ్వనందున సభ నుంచి తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్లు విజయమ్మ చెప్పి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News