: సీఎం కిరణ్ ఉచ్చులో స్పీకర్ పడరాదు: కేటీఆర్
టీబిల్లును దహనం చేసిన వారే.. ఇప్పుడు శాసనసభలో చర్చకు అదనపు సమయం కావాలని అడగడం విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా, రూల్స్ ప్రకారమే స్పీకర్ అసెంబ్లీని నడపాలని కోరారు. ఈ రోజు శాసనసభ వాయిదా పడిన సమయంలో ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సభ పూర్తి స్థాయిలో కొలువైన సమయంలో చర్చకు సమయం సరిపోవడం లేదనే వాదన సరైంది కాదని విమర్శించారు. వెంటనే చర్చను పూర్తిచేసి రాష్ట్రపతికి పంపాలని కోరుతున్నామని చెప్పారు. సీఎం కిరణ్ ఎన్ని కుట్రలు పన్నినా స్పీకర్ ఆయన ఉచ్చులోకి పడరాదని కోరారు. అవసరమైతే ఈ నాలుగు రోజుల పాటు 24 గంటలు సభను నడపాలని కోరారు. ఈ సమయంలో భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేయాలని సూచించారు.